Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో దొంగలు పడుతారనే భయం వుందా? అయితే ఈ పని చేయండి..

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (12:32 IST)
Blink cameras
ఇంట్లో దొంగలు పడుతారనే భయం వుందా? అలాంటి వారికి తాజాగా ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్ బ్లింక్ అవుట్‌డోర్‌, ఇండోర్‌ అనే రెండు వైర్‌లెస్‌ హోం సెక్యూరిటీ కెమెరాలను అమెరికాలో విడుదల చేసింది. త్వరలో భారత్‌లో కూడా వీటిని విడుదల చేయనుంది. ఈ కెమెరాల ద్వారా బ్లింక్‌ ఇండోర్‌, బ్లింక్‌ అవుట్‌డోర్‌ హోమ్‌ సెక్యూరిటీ కెమెరాల ఎంతో సులభంగా ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకోవచ్చు.
 
అవుట్‌డోర్‌ కెమెరా ఇంటి బయట భద్రత కోసం కాగా, ఇండోర్‌ కెమెరా ఇంటి లోపలి భద్రత కోసం.. అవుట్‌డోర్‌ కెమెరా వాటర్‌ రెసిస్టెంట్ ఫీచర్‌ ఉంది. వీటిని మనకు నచ్చిన ప్రదేశంలో ఏర్పాటు చేసి మొబైల్‌ ఫోన్‌ నుంచి మానిటర్‌ చేయవచ్చు. అలాగే మనకు కావాల్సిన చోటికి వీటిని సులభంగా మార్చుకోవచ్చు. ఇండోర్‌ కెమెరాలో యాక్టివ్ జోన్‌, ప్రైవసీ జోన్‌ అని రెండు ఆప్షన్స్‌ ఉంటాయి. వాటి సహాయంతో కెమెరా పరిధిలోని కొంత ప్రాంత్రాన్ని బ్లర్ చేయవచ్చు. 
 
అలా మనకు నచ్చిన ప్రదేశాన్ని మాత్రమే మానిటర్‌ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అంతేకాకుండా బ్లింక్‌ యాప్‌ ద్వారా ఇంట్లో ఉన్న వారిని చూస్తూ వారితో మాట్లాడవచ్చు. అవుట్‌డోర్‌ కెమెరాలో కూడా ఈ సదుపాయం ఉంది. రెండు కెమెరాలకు అలెక్సా ఫీచర్‌ ఉంది. 
 
ఫీచర్లు.. 
బ్యాటరీ సామర్థ్యం... ఏఏ లిథియం బ్యాటరీలు రెండు సంవత్సరాలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయి.
రికార్డయిన వీడియోలను స్టోర్‌ చేసేందుకు బ్లింక్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌కి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. 
 
ధర విషయానికొస్తే అవుట్‌డోర్‌ కెమెరా ధర 100 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.8,000)
ఇండోర్‌ కెమెరా ధర 80 డాలర్లు (రూ. 6,000)

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments