Webdunia - Bharat's app for daily news and videos

Install App

వావివరుసలు మరిచి సోదరుడితో అక్రమ సంబంధం.. భర్తను హతమార్చి పరార్...

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (12:28 IST)
పలువురు స్త్రీపురుషులు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లుమూసుకునిపోయి వావి వరుసలు మరిచిపోయి పరాయి స్త్రీపురుషులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత తాము కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చుతున్నారు. తాజాగా ఫిలిబిత్‌లో ఓ మహిళ... వావివరుసలు మరిచిపోయి.. సోదరుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో అతన్ని దారుణంగా హతమార్చి, ప్రియుడితో కలిసిపారిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిత్ జిల్లా, గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహాస్ గ్రామానికి చెందిన రాందాస్ (40) అనే వ్యక్తి నన్హిదేవి అనే మహిళను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, నన్హిదేవి తనకు సోదరుడి వరుసయ్యే ఉమాస్సార్ గ్రామానికి చెందిన బన్వరీ లాల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
 
ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యను మందలించాడు. దీన్ని జీర్ణించుకోలేని నన్హిదేవి.. తమ బంధానికి భర్త అడ్డొస్తున్నాడని ఆగ్రహించుకుంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇద్దరూ కలిసి రాందాస్‌ నిద్రపోతుండగా, నైలాన్‌ తాడు బిగించి హతమార్చి పరారయ్యారు. 
 
ఉదయం మృతుడి తండ్రి లాల్‌జీత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. గజ్రౌలా-డియోరియా రహదారిపై అగ్యారీ క్రాసింగ్ వద్ద నన్హి దేవితోపాటు భన్వరీ లాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments