అమేజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్.. భారీ ఆఫర్స్, డిస్కౌంట్లు

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (15:47 IST)
దసరా, దీపావళి పండగ సీజన్‌ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ను ప్రకటించింది. అక్టోబరు 17వ తేదీన ఈ ప్రత్యేక సేల్‌ ప్రారంభం కానుంది.

అయితే, ఎప్పటివరకూ ఈ ఫెస్టివల్‌ కొనసాగుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో భాగంగా అమేజాన్‌లో వస్తువులు కొనుగోలు చేసేవారు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌/క్రెడిట్‌ కార్డును ఉపయోగించి పది శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు.
 
షరతులకు లోబడి ఈఎంఐలపై కూడా ఇది వర్తిస్తుంది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కలిగిన వారు 24 గంటల ముందు నుంచే గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు.

ఈ సందర్భంగా అక్టోబరు 14న విడుదల చేసే వన్‌ప్లస్‌ 8టీ 5జీ ఫోన్‌, అక్టోబరు 15న తీసుకురానున్న అమేజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌ లైట్‌లను ఈ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో అమ్మకానికి తీసుకురానున్నారు. 
 
వీటితో మొబైల్‌ ఫోన్లు, గృహోపకరణాలు, నిత్యావసర సరకులు, దుస్తులు, పుస్తకాలు, పిల్లల బొమ్మలపై కూడా రాయితీలు లభించనున్నాయి. బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ డెబిట్‌/క్రెడిట్‌ కార్డుపై వడ్డీ రహిత వాయిదాల్లో వస్తువులను కొనుగోలు చేయవచ్చు. 
 
అదే సమయంలో అమేజాన్‌ యాప్‌లో రాత్రి 8గంటల నుంచి అర్ధరాత్రి వరకూ సాగే గోల్డెన్‌ అవర్స్‌లో మరికొన్ని వస్తువులపై నిబంధనల మేరకు ప్రత్యేక రాయితీ లభించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raja: క్షమాపణ, రాణి మారియా త్యాగం నేపథ్యంగా ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్

వర్కౌట్లు చేయడం వల్లే అలసిపోయా.. బాగానే ఉన్నాను : గోవిందా

Raja Saab: ప్రభాస్ 23 ఏళ్ల కెరీర్ గుర్తుగా రాజా సాబ్ స్పెషల్ పోస్టర్

Bad girl: బ్యాడ్ గర్ల్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా.. శోభిత కితాబు

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments