Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొగ్గు స్కామ్‌లో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి!

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (15:36 IST)
బొగ్గు స్కామ్‌లో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే దోషిగా తేలారు. ఈయనతో పాటు.. మరో ముగ్గురు కూడా ముద్దాయిలుగా పేర్కొంటూ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. వీరికి ఈ నెల 14వ తేదీన శిక్షలను ఖరారు చేయనుంది. 
 
గత 1999లో జార్ఖండ్‌ రాష్ట్రంలోని బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్ర‌మాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా, 1999లో జార్ఖండ్‌లోని గిరిధిలో ఉన్న బ్ర‌హ్మ‌దిహ బొగ్గు గ‌నుల‌ను కాస్ట్రాన్ టెక్నాల‌జీస్ లిమిటెడ్‌కు కేటాయించగా, ఇందులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.   దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ఈ కేసు విచారణ సుధీర్ఘంగా సాగింది.
 
ఈ స్కామ్ మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి హయాంలో జరిగింది. ఆసమయంలో దిలీప్ రే కేంద్ర ఉక్కు, బొగ్గు శాఖామంత్రిగా పని చేశారు. దీంతో ఈ స్కామ్‌లో ఆయనతో పాటు.. మరో ముగ్గురు అవినీతికి పాల్పడినట్టు ప్రత్యేక న్యాయస్థానం గుర్తించింది. ఈ నలుగురు దోషులు నేర‌పూరిత కుట్ర‌కు పాల్ప‌డిన‌ట్లు ప్ర‌త్యేక జ‌డ్జి భార‌త్ ప‌రాశ‌ర్ తెలిపారు. 
 
కాగా, దిలీప్‌తో పాటు దోషులుగా తేలిన వారిలో బొగ్గుగ‌నుల శాఖ‌లో ప‌నిచేసిన సీనియ‌ర్ అధికారులు కూడా ఉన్నారు. ఈ నెల 14న కోర్టు వీరందరికీ శిక్షను ఖరారు చేయనుంది. ఈ నలుగురు ఈ కేసు తీర్పు సందర్భంగా ఢిల్లీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments