Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దోషిగా తేలిన మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్

దోషిగా తేలిన మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్
, మంగళవారం, 28 జులై 2020 (11:22 IST)
Malaysia Ex PM
మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ దోషిగా తేలారు. లక్షల డాలర్ల అవినీతి కేసులో.. ఆయనను దోషిగా తేల్చారు. మొత్తం ఏడు అభియోగాల్లో నజీబ్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

మనీలాండరింగ్‌, అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని నజీబ్ కోర్టుకు తెలిపారు. మలేషియా డెవలప్‌మెంట్ బెర్హాద్‌ (వన్ ఎండీబీ) ఫండ్ కేసులో భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
మాజీ ప్రధాని నజీబ్ ఆ ఫండ్ నిధులను దుర్వినియోగం చేశారని కేసు నమోదైంది. ఆ ఫండ్ నుంచి సుమారు పది మిలియన్ల డాలర్ల అమౌంట్‌ను ప్రధాని ప్రైవేటు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

2009 నుంచి 2018 వరకు నజీబ్ మలేషియా ప్రధానిగా చేశారు. ఈ కేసులో మాజీ ప్రధాని నజీబ్‌కు 15 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశాలు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుణ్యం కట్టుకున్న కరోనా వైరస్ : 33 సార్లు తర్వాత టెన్త్ పాసయ్యాడు...