Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్లైట్ చార్జీలను అధికమిస్తున్న ఆంబులెన్స్ చార్జీలు

Advertiesment
Ambulance
, సోమవారం, 27 జులై 2020 (15:48 IST)
హైదరాబాదులో ఆంబులెన్స్ చార్జీలు ఫ్లైట్ చార్జీలను మించిపోతున్నాయి. కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న కొందరు ఆంబులెన్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. కేవలం ఐదు కిలోమీటర్ల దూరానికి పదివేలకు పైగా చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ఆస్పత్రికి వెళ్లేలోపు జేబులు ఖాళీ అవుతున్నాయి.
 
ఒకవైపు కరోనా మహమ్మారి ప్రజలను బలి తీసుకుంటుంటే కొందరు మాత్రం దానిని క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా భయాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు డబ్బులు నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఇదే ఆసరాగా చేసుకున్న ఆంబులెన్స్ నిర్వాహకులు దోపిడీకి పాల్పడుతున్నారు.
 
అత్యవసర పరిస్థితులలో 108 వాహనాలు సకాలంలో రాకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆంబులెన్స్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే తాము నిబంధనలకు మేరకే చార్జీలు వసూలు చేస్తున్నామని ఆంబులెన్స్ నిర్వాహకులు అంటున్నారు. ఏదేమైనా కరోనా లాంటి విపత్కర పరిస్థితిల్లో ఆంబులెన్స్ సామాన్యులకు తలకు మించిన భారంగా మారిందని  అంటున్నారు. 108 వాహనాల సంఖ్యను ప్రభుత్వం పెంచితే ప్రజలకు ఇబ్బందులుండవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఆనవాళ్లను తుడిచిపెట్టేశారు.. వైద్యుడి ఆరోపణ