Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్ నుంచి 20వేల ఉద్యోగాలు.. ఇంటర్ పాసైతే చాలు..

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (19:09 IST)
ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ ఇండియా దాదాపు 20వేల మంది ఉద్యోగాలను భర్తీ చేయనుంది. 'వర్చువల్ కస్టమర్ సర్వీస్‌'లో భాగంగా ఇంటి నుంచే పనిచేసే వీలును కల్పిస్తూ ఈ ఉద్యోగాలు ఇవ్వనుంది. ఈ-మెయిల్, చాట్, సోషల్ మీడియా, ఫోన్ వంటి సాధనాల సాయంతో వారు పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల కోసం కనీసం 12వ తరగతి ఉత్తీర్ణులై ఇంగ్లీషుతో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ వంటి ఏదైనా ఒక ప్రాంతీయ భాషలో అభ్యర్థులు ప్రావీణ్యం కలిగి ఉండాలి. 
 
రానున్న వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగే అవకాశం వుండటంతో హైదరాబాద్‌, పూణె, కోయంబత్తూరు, నోయిడా, కోల్‌కతా, జైపూర్, చండీగఢ్, మంగళూరు, ఇండోర్, భోపాల్, లక్నోల్లో ఈ నియామకాలు వుంటాయని అమేజాన్ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
తాత్కాలికంగా నియమించుకున్న వారిని.. ఉద్యోగుల సమర్థత, బిజినెస్‌ అవసరాల ఆధారంగా శాశ్వత ఉద్యోగాలకూ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని అమేజాన్ ఇండియా తెలిపింది. వినియోగదారుల నుంచి వచ్చే డిమాండును బట్టి తాము ఉద్యోగులను నియమించుకుంటూనే ఉన్నామని చెప్పింది.
 
రానున్న ఆరు నెలల్లో కస్టమర్ల నుంచి డిమాండు బాగా వచ్చే అవకాశం ఉండడంతో ఉద్యోగులను పెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. కాగా, 2025లోపు భారత్‌లో దాదాపు మిలియన్ కొత్త ఉద్యోగాల కల్పన కోసం ప్రణాళిక వేసుకున్నామని ఈ ఏడాది ఆరంభంలో అమేజాన్‌ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments