Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 14వ సీజన్ : ఆటగాళ్ళ వేలం పాటలు హోరు

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (14:15 IST)
దేశంలో మరో ఐపీఎల్ క్రికెట్ సందడి ప్రారంభంకానుంది. మార్చి నెలాఖరు లేదు ఏప్రిల్ నెల మొదటివారంలో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ సీజన్‌కు ముందే అన్ని ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకున్న, వదులుకున్న ఆటగాళ్ల జాబితాలను జనవరిలో విడుదల చేశాయి. 
 
అలాగే గతవారం ట్రేడింగ్‌ విండో కూడా ముగిసింది. ఇక మిగిలింది వేలం పాటే. అది కూడా గురువారం మధ్యాహ్నం నుంచి మొదలైంది. దీంతో 2021 సీజన్‌కు ఆయా ఫ్రాంఛైజీలు కొత్తగా ఎవరెవరిని కొనుగోలు చేస్తున్నాయనే అంశంపై ఆసక్తి మొదలైంది. 
 
ఈ వేలంలో పాల్గొనడానికి మొత్తం 1,144 మంది ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోగా, అందులో 292 మందిని ఎంపిక చేశారు. వారిలోనూ 164 మంది భారత ఆటగాళ్లకు, 125 విదేశీ ఆటగాళ్లకు, మరో ముగ్గురు అసోసియేట్‌ దేశాల ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. 
 
ఇక ఈ 292 మంది క్రికెటర్లలో 61 మందినే వేలంలో ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అత్యధికంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 11 మందిని తీసుకొనే అవకాశం ఉంది. తర్వాత అత్యధిక ఖాళీలున్న జట్లు పంజాబ్‌, రాజస్థాన్‌. ఈ రెండు జట్లు ఇంకా 9 మంది చొప్పున కొనుగోలు చేసే అవకాశం ఉంది.
 
ఇక ముంబై ఇండియన్స్‌ ఏడుగురు ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరుగురు ఆటగాళ్లను తీసుకొనే వీలుంది. చివరగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కేవలం ముగ్గుర్ని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జట్టులో ఇప్పటికే 22 మంది ఆటగాళ్లున్నారు. 

సంబంధిత వార్తలు

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments