Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ విజృంభణ.. కేకేఆర్‌కు షాక్.. అక్షర్ పటేల్‌కు పాజిటివ్

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (16:31 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ -14 సీజన్‌కు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ కరోనా వైరస్ క్రికెటర్లను వెంటాడుతోంది. ఇప్పటికే కేకేఆర్‌ ఆటగాడు నితీష్‌ రాణాకు కరోనా సోకగా,  తాజాగా మరో క్రికెటర్‌ కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు కరోనా వైరస్‌ సోకింది.

తాజాగా అక్షర్‌కు చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం ప్రకటించింది. ‘అక్షర్‌కు కరోనా  వైరస్‌ సోకింది. ఇది చాలా దురదృష్టకరం. ప్రొటోకాల్స్‌ ప్రకారం అక్షర్‌ ఐసోలేషన్‌కు వెళ్లనున్నాడు’ అని తెలిపింది. 
 
ఈ నెల 9వ తేదీ నుంచి ఆరంభం కానున్న తరుణంలో ఆటగాళ్లంతా క్వారంటైన్‌ నియమాలు పాటిస్తూ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. కాగా,  అక్షర్‌కు చేసిన కరోనా టెస్టులో ఆ వైరస్‌ సోకిందని తేలడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ శిబిరంలో ఆందోళన మొదలైంది. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) నియమావళి ప్రకారం అక్షర్‌ పది రోజుల పాటు ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. అతనికి కరోనా నెగిటివ్‌ వచ్చిన తర్వాతే జట్టుతో కలవనున్నాడు. 
 
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ ద్వారా ఆ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసి ఇరగదీశాడు అక్షర్‌. మొత్తం 27వికెట్లు సాధించి సత్తాచాటాడు. మరొకవైపు ఐదు మ్యాచ్‌ల ట్వంటీ 20 సిరీస్‌లో కూడా అక్షర్‌ ఆడాడు.  కాగా,ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 10వ తేదీన సీఎస్‌కేతో ఆడాల్సి ఉంది. అయితే ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఇక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో ముంబైలో మ్యాచ్‌లు జరపాలా.. వద్దా అనే డైలమాలో ఉంది బీసీసీఐ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments