Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా వైరస్ బారినపడిన హీరోయిన్ ఫ్యామిలీ!

Advertiesment
కరోనా వైరస్ బారినపడిన హీరోయిన్ ఫ్యామిలీ!
, గురువారం, 1 ఏప్రియల్ 2021 (22:50 IST)
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. ఎంతో జాగ్రత్తగా ఉండే సెలెబ్రిటీలు, వీవీఐపీలు, వీఐపీలు కూడా ఈ వైరస్‌కు చిక్కుతున్నారు. తాజాగా నెక్స్ట్ నువ్వే అనే చిత్రం ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన హీరోయిన్ వైభవి శాండిల్య. తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. కానీ, తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో ఈమె ఇప్పుడు కరోనా వైరస్‌ బారినపడింది. ఈమెకు ఒక్కదానికే కాకుండా, కుటుంబసభ్యులంతా ఈ వైరస్‌ కోరల్లో చిక్కుకున్నారు. 
 
దీనిపై వైభవి స్పందిస్తూ.. గత బుధవారం నుంచి జ్వరం, బాడీ పెయిన్స్‌, నీరసం వంటి లక్షణాలు కనిపించడంతో వైద్యపరీక్షలు చేయించుకున్నానని, ఈ పరీక్షల్లో తొలుత నెగెటివ్‌ ఫలితం వచ్చిందని, దీంతో ఊపిరి పీల్చుకున్నానని, అయితే, కంటిన్యూగా దగ్గు, జ్వరం, జలుబు వుండటంతో మరోమారు కరోనా నిర్థారణ పరీక్ష చేయించగా, అందులో పాజిటివ్‌ అని తేలిందని పేర్కొంది. 
 
తనతో పాటు తన తల్లిదండ్రులకు కూడా ఈ వైరస్‌ సోకిందనీ, దీంతో తామంతా క్వారంటైన్‌లో, ఆరోగ్యంగా ఉన్నట్టు వివరించింది. అదేసమయంలో తమను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైకాకు షాక్ : డైరెక్టర్ శంకర్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు