Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాంఖడే స్టేడియం సిబ్బందిలో 8 మందికి కరోనా

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (10:14 IST)
ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఆరంభానికి ముందే కరోనా కలకలం రేపింది. ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందిలో 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా పాజటివ్‌గా సోకిన వారందరిని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. 
 
దీంతో ఏప్రిల్‌ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌, సీఎస్‌కే మధ్య జరగనున్న లీగ్‌ మ్యాచ్‌ను నిర్వహించాలా వద్దా అనే దానిపై బీసీసీఐ తర్జన భర్జన పడుతోంది. తాజాగా కరోనా కేసులు వెలుగు చూడడంతో వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై బీసీసీఐ పునరాలోచన చేస్తుంది.
 
కాగా దేశంలో కరోనా ఉదృతి ఎక్కువగా ఉండడంతో ఈసారి ఐపీఎల్‌ సీజన్‌ను 6 వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీ వేదికలుగా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. 
 
ఐపీఎల్‌లో ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలకు హోం అడ్వాంటేజ్‌ లేకుండా ఆరు వేదికల్లో మ్యాచ్‌లు ఆడేలా ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్‌ 14వ సీజన్‌కు ఇంకా ఆరు రోజులే మిగిలిఉన్న నేపథ్యంలో  తాజాగా వాంఖడే స్టేడియం సిబ్బందికి కరోనా సోకడంతో కలవరం మొదలైంది.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments