Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నై చేరుకున్న విరాట్ కోహ్లి: 7 రోజులు క్వారెంటైన్, ఎందుకని?

Advertiesment
చెన్నై చేరుకున్న విరాట్ కోహ్లి: 7 రోజులు క్వారెంటైన్, ఎందుకని?
, గురువారం, 1 ఏప్రియల్ 2021 (15:34 IST)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఐపిఎల్ జట్టులో చేరేందుకు గురువారం చెన్నై చేరుకున్నారు. ఐతే జట్టుతో కలిసే ముందు కోహ్లి ఏడు రోజులపాటు క్వారెంటైన్లో వుంటాడు. కోవిడ్ నిబంధనలు ప్రకారం ఈ మేరకు కోహ్లి క్వారెంటైన్లో వుండనున్నాడు.

మరోవైపు ఏప్రిల్ 9 నుండి ప్రారంభమయ్యే రాబోయే సీజన్ కోసం ఈ బృందం మంగళవారం తన శిక్షణను ప్రారంభించింది. "కెప్టెన్ విరాట్ కోహ్లీ చెన్నై చేరుకున్నారు" అని ఆర్‌సిబి ఒక ట్వీట్‌లో కోహ్లీ రాకను ప్రకటించింది. కెప్టెన్ కోహ్లి మాస్కు ధరించిన చిత్రాన్ని షేర్ చేసింది.
 
ఏప్రిల్ 9 న చెన్నైలో జరిగే టోర్నమెంట్ ఓపెనర్‌లో ఆర్‌సిబి డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కొంటుంది. 2008లో ఐపిఎల్ ప్రారంభమైనప్పటి నుండి ఆర్‌సిబితో ఉన్న కోహ్లీ, ఇంగ్లండ్‌పై భారత వన్డే సిరీస్ విజయం సాధించిన ఉత్సాహంలో వున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచిన్‌కు కరోనా.. నా ఫేవరేట్ ప్రత్యర్థి త్వరలో కోలుకావాలి.. అక్తర్