అక్టోబరులో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ : పాక్ ఆటగాళ్లకు వీసాలు లభించేనా?

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (17:40 IST)
వచ్చే అక్టోబరు నెలలో ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, ఈ ఐసీసీ టోర్నీలో పాకిస్థాన్ క్రికెట‌ర్లు పాల్గొనాలంటే భార‌త ప్ర‌భుత్వం వాళ్ల‌కు వీసాలు మంజూరుచేయాల్సి ఉంటుంది. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లకు భారత ప్రభుత్వం వీసాలు జారీ చేస్తుందా లేదా అనే అంశంపై పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. గత కొన్నేళ్లుగా రెండు దేశాల మ‌ధ్య ఉన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇది సాధ్య‌మ‌వుతుందా అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 
 
అందుకే దీనిపై త‌మ‌కు ఖచ్చిత‌మైన హామీ ఇవ్వాల‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎహ‌సాన్ మ‌ని కొంత‌కాలంగా కోరుతున్నారు. భార‌త ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు ఈ హామీ ఇప్పించాల‌ని అటు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని ఆయ‌న కోరారు.
 
దీనిపై చ‌ర్చించేందుకు బీసీసీఐతో ఐసీసీ గురువారం స‌మావేశ‌మైంది. ఈ మీటింగ్‌లో త‌మ‌కు రెండు అంశాల‌పై సానుకూల స్పంద‌న ల‌భించింద‌ని ఐసీసీ వెల్ల‌డించింది. పాకిస్థాన్ క్రికెట‌ర్ల‌కు వీసాల జారీపై భార‌త ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు సానుకూలంగా ఉన్న‌ట్లు బీసీసీఐ చెప్పింద‌ని ఐసీసీ తెలిపింది. 
 
ఇక రెండోది ఈ టోర్నీ ప్ర‌భుత్వం నుంచి మిన‌హాయింపులు కావాల‌ని కూడా ఐసీసీ కోరుతోంది. ఈ విష‌యంలోనూ ప్ర‌భుత్వం సానుకూలంగానే ఉన్న‌ట్లు బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. నెల రోజుల్లోపే ఈ రెండు స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయని ఐసీసీ ఆశాభావం వ్య‌క్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

తర్వాతి కథనం
Show comments