Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాఫ్ట్ సిగ్నల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం

Advertiesment
సాఫ్ట్ సిగ్నల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం
, ఆదివారం, 28 మార్చి 2021 (12:54 IST)
స్వదేశంలో భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఇందులో ఆటగాళ్లు ఔటా..? నాటౌటా? అనే విషయంలో థర్డ్ అంపైర్ తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. దీంతో అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌పై చర్చ సాగుతుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
వచ్చే నెల 9 నుంచి జరగనున్న ఐపీఎల్‌లో ఫీల్డ్‌లో ఉండే అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌ను పరిగణనలోకి తీసుకోరాదని పేర్కొంది. ఐపీఎల్ నిబంధనల్లోని అపెండిక్స్ డీ-క్లాస్ 2.2.2 ప్రకారం చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
 
కాగా, ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన టీ-20 సిరీస్‌లో సూర్యకుమార్ ఇచ్చిన క్యాచ్‌ని ఇంగ్లండ్ అటగాడు డేవిడ్ మలాన్ డైవ్ చేస్తూ పట్టుకోగా, ఆ బంతి నేలను తాకినట్టు స్పష్టంగా కనిపించింది. 
 
అయితే, గ్రౌండ్‌లో ఉన్న అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌గా అవుట్‌ను ప్రకటించడంతో రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడని థర్డ్ అంపైర్ దాన్ని అవుట్‌గా ప్రకటించాడు. ఈ విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
 
దీంతో ఐపీఎల్‌లో ఇటువంటి తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని భావించిన బీసీసీఐ, ఫీల్డ్ అంపైర్‌తో సంబంధం లేకుండా, తనకు రిఫర్ చేసిన బాల్స్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశం లభించనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూణె వేదికగా మూడో వన్డే : నేడు చావో రేవో...