ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో విజయం సాధించి జోష్‌లో ఉన్న టీమిండియాకు షాక్ తగిలింది. ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో శ్రెయాస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. బంతిని ఆపే క్రమంలో శ్రేయస్ అయ్యర్ భుజానికి బలంగా దెబ్బ తగిలింది. వెంటనే మైదానం వీడిన అతడిని స్కానింగ్ కోసం పంపించారు. గాయం తీవ్రత దృష్ట్యా అయ్యర్ తదుపరి మ్యాచ్‌ల్లో అతను బరిలోకి దిగే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు తెలిసింది.
అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి కూడా అయ్యర్ దూరం కావడం గట్టి ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన ఫస్ట్ వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా కిందపడ్డ అయ్యర్ ఎడమ భుజం డిస్‌లోకేట్ అయ్యింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో కొట్టిన షాట్‌ను అడ్డుకునే క్రమంలో డైవ్ చేసిన అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ గాయం తీవ్రమైతే ఐపీఎల్‌లో కూడా ఆడటం కష్టం కావొచ్చు.
ఇదే మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తుండగా అతని కుడి మోచేతికి బంతి బలంగా తాకింది. నొప్పి ఎక్కువగా ఉండటంతో రోహిత్ ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్నాడు.