Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2021 UAE: ఆసీస్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూరం.. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు..!

Webdunia
శనివారం, 29 మే 2021 (15:43 IST)
కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్‌ను పున: ప్రారంభించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం వాయిదా పడిన ఐపీఎల్ 2021ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లు జరగనున్నట్లు తెలుస్తోంది.
 
గతేడాది నిర్వహించిన వేదికల్లోనే మిగిలిన 31 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. దుబాయ్‌, అబుదాబీ, షార్జా స్టేడియంలలో బయోబబుల్ వాతావరణంలో లీగ్‌ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. కాగా, ఐపీఎల్ సెకండాఫ్‌కు ఆసీస్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూరం కానున్నట్లు సమాచారం.
 
మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లు యూఏఈలో జరిగితే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి అవుతుంది. అంతకుముందు 2014 లో భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా లీగ్‌లో మొదటి 20 మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం ఇచ్చింది. అదేవిధంగా, భారత్ లో కరోనా కారణంగా 2020 సీజన్ పూర్తిగా యూఏఈలో జరిగింది. గత సీజన్‌లో దుబాయ్, అబుదాబి, షార్జాతో సహా 3 స్టేడియంలో 60 మ్యాచ్‌లు జరిగాయి. 
 
ఇది యూఏఈకి కూడా మంచి ఆదాయాన్ని ఆర్జించింది. ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బదులుగా బిసీసీఐ గత ఏడాది 98.5 కోట్ల రూపాయలను అరబ్ క్రికెట్ బోర్డుకు ఇచ్చింది. అందువల్ల ఇప్పుడు 31మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడం యూఏఈకి పెద్ద విషయం కాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments