మరికాసేపట్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ హైదరాబాద్ ఢీ

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2020 (14:17 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో 17వ మ్యాచ్ మ‌రికాసేప‌ట్లో దుబాయ్‌లోని షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. 
 
ఈ మ్యాచ్‌లో రోహిత్‌శ‌ర్మ నేతృత్వంలోని ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుతో వార్న‌ర్ సార‌థ్యంలోని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. ఈ ఐపీఎల్‌లో రెండు జ‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు ఐదేసీ మ్యాచ్‌లు ఆడి రెండేసి మ్యాచ్‌ల‌లో విజ‌యం సాధించాయి. 
 
పాయింట్ల ప‌రంగా చూస్తే నాలుగేసి పాయింట్ల‌తో స‌మంగా ఉన్న‌ప్ప‌టికీ.. నెట్ ర‌న్‌రేట్ ఆధారంగా పాయింట్ల ప‌ట్టిక‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు మూడో స్థానంలో, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు నాలుగో స్థానంలో కొన‌సాగుతున్నాయి. 
 
కాగా, ఈ మ్యాచ్, ఆదివారం మధ్యాహ్నం 3:30 గంట‌లకు మ్యాచ్ ప్రారంభం కానున్న‌ది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే రెండు జ‌ట్లు అబుదాబిలోని హోట‌ళ్ల నుంచి షార్జా క్రికెట్ స్టేడియానికి బ‌య‌లుదేరాయి.
 
కాగా ఇరు జట్లూ ఇప్పటివరకు 14 సార్లు తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లూ తలా ఏడేసి మ్యాచ్‌లలో విజయం సాధించాయి. గత ఐదు మ్యాచ్‌లలో గెలుపోటములను పరీశీలిస్తే, ముంబై ఇండియన్స్ ఒక మ్యాచ్‌లో గెలుపొందగా, హైదరాబాద్ జట్టు మూడు మ్యాచ్‌లలో గెలుపొందింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశాన్ని నాశనం చేస్తున్నారు... పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ధ్వజం

ఢిల్లీ రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్ - మోస్ట్ వాంటెండ్ సిగ్మా గ్యాంగ్‌స్టర్లు హతం

బాలికను మూత్ర విసర్జనకు సపోటా తీసుకెళ్లిన నిందితుడు ఆత్మహత్య

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్

టెక్ సిటీలో బెంగుళూరులో వెస్ట్ బెంగాల్ మహిళపై గ్యాంగ్ రేప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

తర్వాతి కథనం
Show comments