Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020 : హ్యాట్రిక్‌పై రాజస్థాన్ కన్ను - విజయమే లక్ష్యంగా కేకేఆర్

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (11:44 IST)
ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇపుడు హ్యాట్రిక్‌పై కన్నేసింది. ముఖ్యంగా, పంజాబ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని సైతం అలవోకగా ఛేదించి పెను ప్రకంపనలు సృష్టించిన రాజస్థాన్ ఈసారి కూడా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. 
 
ఇకపోతే, హైదరాబాద్‌పై గెలిచి ఈ సీజన్‌లో బోణీ కొట్టిన కోల్‌కతా కూడా విజయమే లక్ష్యంగా పెట్టుకుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే మెరికల్లాంటి క్రికెటర్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. 
 
ప్రధానంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంజూ శాంసన్, రాహుల్ తెవాటియా, కెప్టెన్ స్టీవ్ అసాధారణ ఫామ్‌లో ఉన్నారు. ఈ త్రయం విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి పోయింది. దీంతో రాజస్థాన్ 224 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా సునాయాసంగా ఛేదించింది. 
 
శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. అతన్ని కట్టడి చేయడం ప్రత్యర్థి బౌలర్లకు శక్తికిమించిన పనిగా తయారైంది. ఇక స్మిత్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. తెవాటియా కూడా జోరుమీదుండటం రాజస్థాన్‌కు ఊరటనిచ్చే విషయం. 
 
ఇక కోల్‌కతా జట్టులో శుభ్‌మన్ గిల్ ఫామ్‌లోకి వచ్చాడు. మోర్గాన్ కూడా గాడిలో పడటం కోల్‌కతా కలిసి వచ్చే అంశంగా మారింది. బౌలర్లు కూడా మెరుగ్గా రాణిస్తున్నారు. దీంతో కోల్‌కతా కూడా గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది.
 
కాగా, ఈ ఇరు జట్లూ ఐపీఎల్‌ టోర్నీలో ఇప్పటివరకు మొత్తం 20 సార్లు తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లూ పదేసి సార్లు గెలుపొందాయి. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగనుది. పాయింట్ల పట్టికల్ రాజస్థాన్ (పాయింట్లు 4) అగ్రస్థానంలో ఉంటే.. కేకేఆర్ (పాయింట్లు 2) జట్టు ఏడో స్థానంలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ పిల్లవాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసాడా?

IMD: ఆగస్టు 1 నుంచి 7 వరకు ఏడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు

కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ - సెప్టెంబరు 9న ఎన్నిక

ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్.. ప్రేమ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లాడు.. ఆపై అత్యాచారం

కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించిన టీడీపీ మంత్రి సోదరుడు (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

తర్వాతి కథనం
Show comments