Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020కి దూరమైన సురేష్ రైనా... దుబాయ్‌ నుంచి భారత్‌కు.. కారణం ఏంటి?

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (13:13 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 నుంచి సురేష్ రైనా తప్పుకున్నాడు. ఐపీఎల్ 2020లో ఆడేది లేదని.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు సురేష్ రైనా ప్రకటించాడు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ సీజన్‌కి దూరమవుతున్నాడని చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమ ట్విట్టర్‌ ఖాతాలో ప్రకటించింది. ఆయన దుబాయి నుంచి భారత్‌కు వెనక్కి వచ్చేశారని తెలిపింది.
 
కానీ సురేష్ రైనా ఐపీఎల్ 2020 నుంచి ఏ కారణం వల్ల తప్పుకోవాల్సి వచ్చిందనే అంశంపై ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి వుంది. ఈ సమయంలో సురేశ్ రైనాతో పాటు ఆయన కుటుంబానికి మద్దతుగా ఉంటామని చెన్నై సూపర్‌ కింగ్స్ సీఈవో కేఎస్‌ విశ్వనాథన్ పేర్కొంది. కాగా, ఇటీవలే సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే.
 
ఇప్పటికే ఐపీఎల్‌లో ఆడడానికి ఇప్పటికే జట్లు దుబాయికి చేరుకున్నాయి. కాగా, చెన్నై సూపర్‌ కింగ్స్‌లో కొంతమందికి కరోనా సోకిందని వచ్చిన వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైనా దుబాయి నుంచి తిరిగి వస్తుండటం గమనార్హం. సెప్టెంబరు 19న ప్రారంభమయ్యే ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో సీఎస్కే తలపడాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments