సిక్సర్ కొట్టి అపారనష్టాన్ని తెచ్చుకున్న ఐర్లాండ్ క్రికెటర్.. ఎలా?

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (22:29 IST)
సాధారణంగా క్రికెట్‌లో సిక్సర్ కొడితే కొట్టిన బ్యాట్స్‌మెన్‌తో పాటు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించే వేలాది మంది ప్రేక్షకులు, అభిమానులు తెగ సంబరపడిపోతారు. కానీ, ఓ క్రికెటర్ మాత్రం సిక్స్ కొట్టి అపార నష్టాన్ని తెచ్చుకున్నాడు. సిక్స్ కొట్టడమేంటి.. నష్టమేంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
ప్రస్తుతం ఐర్లాండ్‌లో ఓ దేశవాళీ టీ20 లీగ్‌ జరుగుతోంది. అందులో భాగంగా నార్త్ వెస్ట్ వారియర్స్, లీన్‌స్టర్ లైట్నింగ్ జట్ల మధ్య గురువారం ఓ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లీన్‌స్టర్ జట్టు తరపున ఆ దేశ జాతీయ జట్టు క్రికెటర్ కెవిన్ ఓబ్రెయిన్ బరిలోకి దిగాడు. 
 
మొత్తం 37 బంతుల్లో 82 పరుగులు చేసి భారీ ఇన్నింగ్స్ ఆడాడు. సిక్స్‌లతో విరుచుకుపడి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. అయితే కెవిన్ కొట్టిన ఓ సిక్స్ గ్రౌండ్ బయట ఉన్న పార్కింగ్ ప్రదేశంలోని ఓ కారుపై పడింది. దాంతో ఆ కారు వెనుక భాగంలో ఉన్న అద్దం తునాతునకలైపోయింది.
 
తీరా ఆ కారు ఎవరిదా అని చూస్తే.. అది కెవిన్ కారే.. సిక్స్ కొట్టి సొంత కారుకే నష్టం కలిగించుకున్నాడు. మ్యాచ్ ముగిశాక కెవిన్ ఓబ్రెయిన్ తన కారును రిపేరింగ్ షాప్‌కు తీసుకెళ్లాడు. ఆ కారు ఫొటోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. 'ఇక నాకు కారులో ఏసీతో పనిలేదు. కానీ మరోసారి మాత్రం కారును దూరంగా పార్క్ చేస్తాన' అని ఆ పోస్టులో రాసుకొచ్చాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

ఏపీపై మొంథా తుఫాను తీవ్ర ప్రభావం : బాబు - పవన్ ఉన్నతస్థాయి సమీక్ష

నా చావుకి నా భార్య ఆమె ప్రియుడే కారణం: భర్త సూసైడ్

కోస్తా జిల్లాల జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు బంద్

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025: విశాఖపట్నంలో మైదాన్ సాఫ్ కార్యక్రమం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

Adivi Sesh: అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఉగాదికి ఫిక్స్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

తర్వాతి కథనం
Show comments