ఐపీఎల్ ఫైనల్.. వందల కోట్ల బెట్టింగ్‌లు.. కప్ ఎవరిది.. ధోనీదా..? ముంబైదా?

Webdunia
ఆదివారం, 12 మే 2019 (17:12 IST)
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి జరుగనుంది. 2019 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రెండు దిగ్గజ జట్లు అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ నడుమ జరుగనున్న నేపథ్యంలో అభిమానుల్లో ఇరు జట్ల సమానమైన అంచనాలున్నాయి.


2008 నుండి 2018 వరకు మొత్తం 11 సార్లు ఐపీఎల్ టోర్నీ జరగగా, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అత్యధికంగా మూడు సార్లు టైటిల్ ఎగరేసుకుపోయాయి. 
 
కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలు తలో రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్నాయి, ఒక్కసారి మాత్రం రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆ ఘనత సాధించింది. 2019 ఐపీఎల్ ఫైనల్‌లో కూడా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి తలపడుతున్నాయి. 
 
ఇక ఫైనల్ మ్యాచ్ టికెట్స్ విక్రయాలు ప్రారంభించిన 90 నిమిషాలకే అమ్ముడైపోయాయంటే క్రేజ్ ఏ లెవెల్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే మూడు సార్లు టైటిల్ నెగ్గిన ధోనీ టీమ్... మూడు టైటిల్స్ సమానంగా ఉన్న రోహిత్ టీమ్‌తో నాలుగోసారి తలబడే ఫైనల్‌లో విజయం ఎవ్వరిని వరిస్తుందనే దానిపైప వందల కోట్ల బెట్టింగ్ కూడా మొదలైపోయింది.
 
అలాగే ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చిత్తుగా ఓడించింది ముంబై ఇండియన్స్. అదే జోరు కొనసాగిస్తూ ఫైనల్‌లో టైటిల్ నెగ్గేయాలనే ఊపుతో వుంది రోహిత్ సేన. అయితే ఇదే టోర్నీలో ముంబై ఇండియన్స్‌పై మూడుసార్లు ఎదురైన పరాభవానికి ఫైనల్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ ప్లాన్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో 70 ఎకరాల్లో బిట్స్ పిలానీ క్యాంపస్, 10,000 మంది విద్యార్థులు

బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్‌లో కాలుష్య స్థాయిలు ఎక్కువ

Amaravati: ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఏకైక రాజధాని.. చంద్రబాబు క్లారిటీ

కుప్పంలో మూడు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన- రూ.675 కోట్ల పెట్టుబడులు

అమరావతిలో క్యాంటీ వ్యాలీ వుందని చెప్తాను.. ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా తో నాకు ఎన్నో బాల్య జ్ఞాపకాలు ఉన్నాయి : సౌందర్య రజనీకాంత్

Devagudi Review: వాస్తవ ఘటన ఆధారంగా రాయలసీమ ప్రేమకథ దేవగుడి - మూవీ రివ్యూ

రాజమౌళి - మహేశ్ బాబు సినిమా రిలీజ్ డేట్ ఖరారు

త్రివిక్రమ్ శ్రీనివాస్ మోసం చేశారంటున్న మరో హీరోయిన్

అమ్మాయిలను వాడుకునేందుకు కొందరు సినిమాలు తీస్తున్నారు : నిర్మాత తమ్మారెడ్డి

తర్వాతి కథనం
Show comments