Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ రన్ రేట్: టాప్-1లో విరాట్ కోహ్లీ.. రెండో స్థానంలో ధోనీ.. గంభీర్ రికార్డ్ బ్రేక్

ఐపీఎల్-11లో భాగంగా సోమవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 10 వికెట్ల తేడాతో విజయం సాధించి నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా బెంగళూరు కెప్టెన్ విరాట్ క

Webdunia
మంగళవారం, 15 మే 2018 (14:17 IST)
ఐపీఎల్-11లో భాగంగా సోమవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 10 వికెట్ల తేడాతో విజయం సాధించి నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. గంభీర్ రికార్డును అధిగమించాడు. ఫ్లే ఆప్స్ రేసులో నిలవాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారీ విజయాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నమోదు చేసుకుంది. 
 
ఇక ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో గౌతమ్ గంభీర్‌ను విరాట్ కోహ్లీ వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 3,683 పరుగులతో ఈ జాబితాలో టాప్‌లో నిలిచాడు. 
 
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో కెప్టెన్‌గా కోహ్లీ చేసిన పరుగులు 3,525. ఈ ఏడాది ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ పగ్గాలందుకున్న గౌతమ్ గంభీర్.. వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గా గంభీర్ చేసిన పరుగులు 3518 పరుగులు. అలాగే రోహిత్‌ శర్మ (ముంబై ఇండియన్స్‌, (2,269), డేవిడ్‌ వార్నర్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ సారథి, 2099) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments