Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2018 : కోల్‌కతా విజయం.. రాజస్థాన్ ప్లేఆఫ్ ఆశలు గల్లంతు

ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై కోల్‌కతా జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిజానికి వరుసగా మూడు విజయాలతో ప్లేఆఫ్స్‌ వైపు దూసుకెళుతున్న రాజస్థాన్‌ రాయ

Webdunia
బుధవారం, 16 మే 2018 (10:39 IST)
ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై కోల్‌కతా జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిజానికి వరుసగా మూడు విజయాలతో ప్లేఆఫ్స్‌ వైపు దూసుకెళుతున్న రాజస్థాన్‌ రాయల్స్‌కు కోల్‌కతా నైట్‍‌రైడర్స్ జట్టు తేరుకోలేని షాకిచ్చింది. ఇప్పటిదాకా జోస్‌ బట్లర్‌ హవాతో చెలరేగిన ఈ జట్టును కోల్‌కతా బౌలర్లు అడ్డుకున్నారు. కుల్దీప్‌ యాదవ్‌ స్పిన్‌ మాయాజాలంలో ఇరుక్కున్న రాయల్స్‌ చివరకు 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక వీరి ప్లేఆఫ్స్‌ ఆశలకు దాదాపుగా గండిపడినట్టే.
 
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 19 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. బట్లర్‌ 22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేయగా, రాహుల్‌ త్రిపాఠి 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 27 రన్స్‌ చేసి రాణించారు. మ్యాచ్ చివర్లో ఉనాద్కట్‌ 18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులు చేయడంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. కుల్దీప్‌కు నాలుగు, ప్రసిద్ధ్‌.. రస్సెల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. 
 
ఆ తర్వాత 143 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కోల్‌కతా 18 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసి గెలుపొందింది. లిన్‌ 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 45 పరుగులు చేయగా, దినేశ్‌ కార్తీక్‌ 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 41 (నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. స్టోక్స్‌కు 3 వికెట్లు పడ్డాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కుల్దీప్‌కు దక్కింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments