Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

దేవీ
గురువారం, 24 ఏప్రియల్ 2025 (18:12 IST)
Trinadharao Nakkina
దొంగలకి  పాఠం కాదు కానీ దొంగతనం చేయాలనుకునే వారికి ఓ పాఠంలా చౌర్య పాఠం వుంటోందని దర్శకుడు, ఈ చిత్ర నిర్మాత త్రినాథరావు నక్కిన అన్నారు. క్రైమ్-కామెడీ డ్రామా తో మూవీ రూపొందింది. ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఏప్రిల్ 25న  థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత త్రినాథరావు నక్కిన సినిమా విశేషాలు పంచుకున్నారు.  
 
నిర్మించడానికి ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమిటి?
-కార్తిక్ ఘట్టమనేని ఫాదర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. ఆయన సర్వీస్ లో  ఉన్నప్పుడు ఓ చిలిపి దొంగతనం కేసు జరిగింది. ఆ సంఘటన గురించి కార్తిక్ చెప్పినప్పుడు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇది సినిమాగా చేయమని కార్తిక్ ని అడిగాను. తను సరే అన్నాడు. అలా ఈ సినిమా చేయడం జరిగింది. ఆ కేసుని యధావిధిగా తీసుకోలేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పూర్తి సినిమాటిక్ గా చేయడం జరిగింది.
 
హైస్ట్ సినిమాలకి బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా ?
-అవును. మామూలు సినిమాలు కంటే హైస్ట్ సినిమాలు తీయడం ఖర్చుతో కూడుకున్న పని. మేము అనుకున్నదాని కంటే ఒక పదిశాతం బడ్జెట్ పెరిగింది. కంపనీ నుంచి వస్తున్న తొలి సినిమా. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్యాలిటీతో తీశాం. అందులోనూ కార్తిక్ లాంటి డీవోపీ వున్నప్పుడు టెక్నికల్ గా చాలా యాడ్ ఆన్స్ వుంటాయి. సినిమా అవుట్ పుట్ ఎక్సలెంట్ క్యాలిటీతో వచ్చింది.
   
డైరెక్టర్ నిఖిల్ గురించి?
-నిఖిల్ ని కార్తికేయ షూటింగ్ లో చూశాను. చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తాడు. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనుకున్న సమయంలో కార్తిక్.. నిఖిల్ పేరు చెప్పాడు. ఈ సినిమాకి విజువల్ సెన్స్ వున్న డైరెక్టర్ కావాలి. నిఖిల్ కి ఆ ఇమాజినేషన్ వుంది. నేను ఎలా అనుకున్నానో అలా సినిమాని తీర్చిదిద్దాడు. సినిమాని హెల్తీగా ఫినిష్ చేశాం. సినిమా చాలా మెచ్యుర్డ్ గా వుంటుంది. కాన్సెప్ట్ అందరినీ అలరిస్తుంది.  
 
నిర్మాణంలోకి రావడానికి కారణం?
-కొత్తవాళ్ళకి ఒక ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేయడం నా డ్రీం. అది ఎప్పటినుంచో ఉంది. ఒక జనరేషన్ కి ఒక వేదిక ఇచ్చినట్లుగా వుంటుంది. నాకు సంపాదన మీద దృష్టి లేదు. కొత్త వారికి అవకాశం కల్పించాలనే మంచి ఉద్దేశంతోనే నిర్మాణంలోకి రావడం జరిగింది.
 
మొన్న మీరు థియేటర్స్ పై  కామెంట్స్ చేయడానికి కారణం?
-వైరల్ కావాలని ఆ కామెంట్స్ చేయలేదు. యధార్ధం తెలియాలని చెప్పాను. నిజానికి నేను థియేటర్స్ కి రమ్మని ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేశాను. థియేటర్స్ కల్చర్ ని కంటిన్యూ చేయమని కోరారు. కానీ అది వదిలేసి ముందు చెప్పిన మాటలే హైలెట్ చేశారు.
 
ఆడియన్స్ థియేటర్స్ కి తగ్గడానికి కారణం ఏమిటి ?
-చాలా కారణాలు వున్నాయి. సినిమాలు చాలా జాగ్రత్తగా తీయాల్సిన పరిస్థితి వుంది. ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే సినిమాలు తీయడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments