Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన యూట్యూబ్ : అప్‌లోడ్ చేసిన వీడియోల తొలగింపు

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (14:51 IST)
మరికొన్ని రోజుల్లో పదవీచ్యుతుడు కానున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు యూట్యూబ్‌ తేరుకోలేని షాకిచ్చింది. ఆయన ఖాతాను బ్లాక్ చేసింది. అంతకుముందు ఆయన అప్‌లోడ్ చేసిన వీడియోలను కూడా తొలగించింది. 
 
అమెరికాకు గుండెకాయలాంటి క్యాపిటల్‌ హిల్స్ భవన్‌పై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ రెచ్చగొట్టిన విషయం తెల్సిందే. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆయ‌న అధికారిక‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ట్విట్టర్ వంటి ఖాతాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. 
 
తాజాగా ఆయ‌న‌ యూట్యూబ్ ఖాతాను కూడా తాత్కాలికంగా స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ఆ సంస్థ‌ ప్ర‌క‌టించింది. అందులో తాజాగా అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ను యూట్యూబ్ డిలీట్ చేసింది. యూట్యూబ్ నిబంధ‌న‌ల‌ను అందులో ఉల్లంఘించిన‌ట్లు యూట్యూబ్ తెలిపింది.
 
హింస‌ను ప్రేరేపించేలా అందులో కంటెంట్ ఉండ‌టంతో యూట్యూబ్ ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు స‌మాచారం. వారం రోజుల పాటు ట్రంప్ త‌న‌ ఛాన‌ల్‌లో వీడియోల‌ను అప్‌లోడ్ చేయలేరు. కాగా, ట్రంప్ ఛాన‌ల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కొన్ని సామాజిక సంఘాలు డిమాండ్ చేయ‌డంతో యూట్యూబ్ ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.
 
ఆ ఛానెల్‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే దానికి వాణిజ్య ప్ర‌క‌ట‌నల‌ను నిలిపివేసేలా ప్ర‌చారం చేప‌డుతామ‌ని ఆ సంస్థ‌లు హెచ్చ‌రించాయి. అందులో ఎన్నిక‌ల గురించి  అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్న‌ట్లు ఆరోపించాయి. అధ్య‌క్ష‌ ఎన్నిక‌ల్లో మోసం జ‌రిగిన‌ట్లు ఓ వీడియోలో ట్రంప్ వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ట్రంప్ యూట్యూబ్‌ను 2.77 మిలియ‌న్ల స‌బ్‌స్క్రైబ‌ర్లు ఫాలోఅవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments