Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డోనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం : రిపబ్లికన్లు కూడా మద్దతు

డోనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం : రిపబ్లికన్లు కూడా మద్దతు
, ఆదివారం, 10 జనవరి 2021 (17:43 IST)
అమెరికా హృదయం లాంటి క్యాపిటల్ హిల్స్ భవనంపై ప్రస్తుత అధ్యడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. ఈ దాడి ఘటనతో ప్రపంచాన్ని నివ్వెరపాటుకు గురిచేసింది. ఈ దాడి చేసిన ఘటనలో నిఘా వైఫల్యం బయటపడటం, ట్రంప్ వర్గీయులు మరిన్ని దాడులకు తెగబడవచ్చని నిఘా సంస్థలు హెచ్చరించిన తర్వాత, సాధ్యమైనంత త్వరగా ఆయన్ను అభిశంసించాలని యూఎస్ కాంగ్రెస్ భావిస్తోంది.
 
ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ఒక్క రోజు కూడా అధ్యక్ష పదవిలో ఉండేందుకు అర్హుడు కాదని డెమొక్రాట్లు భావిస్తుండటంతో, ఆయనకు వ్యతిరేకంగా పలువురు ట్రంప్ సొంత పార్టీకి చెందిన రిపబ్లికన్లు సైతం మద్దతిస్తుండటం గమనార్హం.
 
6వ తేదీన జరిగినట్టే మరోమారు అరాచక శక్తులు విజృంభించి, బైడెన్ ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని భగ్నం చేసే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉండటంతో వాషింగ్టన్‌లో నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం నాడే ట్రంప్‌‌ను అభిశంసించే ప్రక్రియను ప్రారంభించాలని డెమొక్రాట్లు నిర్ణయించారు. ఈలోగా ఆయనే స్వచ్ఛందంగా వైదొలగాలని, అప్పుడే కొంతైనా పరువును మిగుల్చుకున్న వారవుతారని హెచ్చరిస్తున్నారు.
 
ఇదే విషయాన్ని స్పష్టం చేసిన స్పీకర్ నాన్సీ పెలోసీ, తక్షణం ఆయన గద్దె దిగాలని స్పష్టం చేశామని, లేకుంటే రెండోసారి అభిశంసించడానికి వెనుకాడబోమని ట్రంప్‌కు తెలియజేశామని అన్నారు. 
 
అధ్యక్ష పదవిలో ఉండి తిరుగుబాటును నడిపించిన ట్రంప్, ఆ పదవిలో ఉండేందుకు అర్హుడు కాదని తీర్మానం ముసాయిదాలో పేర్కొన్న సభ్యులు, రేపు సహాకమిటీ ముందుకు దీన్ని తేనున్నారని తెలుస్తోంది. ఆపై బుధ, గురువారాల్లో చర్చించి, తీర్మానం ఆమోదం పొందిన తరువాత సెనేట్ కు పంపాలన్న వ్యూహంలో డెమొక్రాట్ నేతలు ఉన్నారు.
 
కాగా, గత యేడాది నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చిత్తుగా ఓడిపోగా, జో బైడెన్ విజయభేరీ మోగించారు. ఈయన ఈ నెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాల ఏర్పాటు - అధికారుల కమిటీ సిఫార్సు