Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.437 కోట్లకు టోకరా వేసిన థాయ్ యూట్యూబర్

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (17:25 IST)
థాయ్‌లాండ్ దేశానికి చెందిన లేడీ యూట్యూబర్ ఒకరు ఏకంగా రూ.437 కోట్లకు టోకరా వేశారు. డ్యాన్స్ వీడియోలతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఈమె.. ఫారెక్స్ ట్రేడింగ్‌ వీడియోలతో మంచి ఫాలోయర్లను సంపాదించుకుంది. దీంతో ఆమె మాటలు నమ్మి ఏకంగా 6 వేల మంది ఫారెక్స్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టారు. అలా ఏకంగా రూ.437 కోట్లకు ఆమె టోకరా వేశారు. ఈమె పేరు నథామోన్ ఖోంగ్చాక్. ఈమె అందరికీ నట్టీగా సుపరిచితురాలు. 
 
ఈ అందాల భామకు యూట్యూబ్‌లో 8.47 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. నట్టి తన డ్యాన్స్ వీడియోలతో అందరినీ ఆలరిస్తుంటుంది. మఖ్యంగా, విదేశీ మారకద్రవ్యం నేపథ్యంలో అధిక లాభాలు అర్జించడం ఎలాగో ఆశావహులకు ప్రైవేటుగా అహగాన కల్పిస్తుంది. ఈ మేరకు తనకు ఫారెక్స్ ట్రేడింగ్‌లో వచ్చిన లాభాలు అంటూ ఇన్‌స్టా ఖాతాలో పలు పోస్టులు పెట్టింది. దీంతో ఆమె మాటలు నమ్మిన అనేక మంది ఫారెక్స్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టారు. 
 
ఎంత పెట్టుబడి పెడితే అంతకు 35 శాతం అధిక లాభాలతో తిరిగి ఇస్తానంటూ ప్రచారం చేసింది. దీంతో దాదాపు ఆరు వేలకు పైగా నెటిజన్లు పెట్టుబడులు పెట్టింది. అయితే, ఎంతకీ ఒక్కపైసా తిరిగి రాకపోవడంతో తాము మోసపోయినట్టు నట్టి ఫాలోయర్లకు అర్థమైంద. ఆ విధంగా రూ.437 కోట్లకు టోపీ వేసిందని గుర్తించారు. నట్టి చేసిన మోసంపై థాయ్ పోలీసులకు ఏకంగా 102 మంది ఫిర్యాదు చేశారు. దీంతో నట్టికి వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments