Webdunia - Bharat's app for daily news and videos

Install App

వూహాన్‌లో 2019కు ముందే లీకైన కరోనా వైరస్?

Webdunia
సోమవారం, 24 మే 2021 (12:12 IST)
కరోనా వైరస్ పుట్టుకపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ, అనేక దేశాలు మాత్రం చైనాను ముద్దాయిగా చూస్తున్నాయి. ఈ వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి వ్యాపించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే, ఆ ఆరోప‌ణ‌లను నిజం చేసే విధంగా తాజాగా ఓ నివేదిక బ‌య‌ట‌ప‌డింది. 
 
వుహాన్‌లో ఉన్న వైరాల‌జీ ఇన్స్‌టిట్యూట్‌లో ప‌నిచేసే ముగ్గురు ప‌రిశోధ‌కులు 2019 నవంబ‌ర్‌లో హాస్పిట‌ళ్ల చుట్టు తిరిగిన‌ట్లు ఆధారాలు ఉన్నాయి. మ‌హ‌మ్మారిపై చైనా ప్ర‌క‌ట‌న చేయ‌డానికి ముందే.. వుహాన్ ల్యాబ్‌లో ఉన్న సిబ్బంది ఆ వైర‌స్‌తో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు లోనైట్లు గుర్తించారు. 
 
దీనికి సంబంధించిన క‌థ‌నాన్ని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ ప్ర‌చురించింది. అయితే గ‌తంలో అమెరికా ఇంటెలిజెన్స్ ఈ నివేదిక‌ను ఇచ్చిన‌ట్లు కూడా తెలుస్తోంది. ల్యాబ్‌లో ప‌నిచేసే సిబ్బంది హాస్పిట‌ళ్ల‌కు వెళ్లిన తీరు, వారికి ఉన్న అనారోగ్యం, క‌రోనా ఉదృతి పెర‌గ‌డానికి ముందు అక్క‌డ జ‌రిగిన ప‌రిణామాలు అనేక అనుమానాలు దారి తీస్తున్న‌ట్లు ఆ ప‌త్రిక పేర్కొన్న‌ది.
 
వుహాన్ ల్యాబ్ నుంచి వైర‌స్ వ్యాప్తి జ‌రిగిన‌ట్లు మొద‌ట్లో అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోప‌ణ‌లు చేశారు. అయితే దీనిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఇప్ప‌టికే ఓ సారి ద‌ర్యాప్తు చేప‌ట్టింది. వుహాన్ న‌గ‌రాన్ని విజిట్ చేసిన ఆ బృందం.. క‌రోనా వైర‌స్ స‌హ‌జ‌సిద్దంగానే జంతువుల నుంచి మ‌నుషుల‌కు సోకిన‌ట్లు పేర్కొన్న‌ది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments