Webdunia - Bharat's app for daily news and videos

Install App

268 గ్రాముల శిశువు.. ప్రపంచ రికార్డు.. ఇప్పుడేమో 3కేజీలు.. ఎలా?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (14:24 IST)
జపాన్ దేశంలో ఓ మహిళకు గర్భస్థ శిశువు పెరుగుదల ఆరు నెలలకే పరిమితం అయ్యింది. ఆపై ఆ బిడ్డ ఆమె కడుపులో పెరగలేదు. ఫలితంగా ఆమె అరచేతి పరిణామంలో ఆ శిశువుకు జన్మనిచ్చింది. అరచేతి పరిణామంలో పుట్టిన ఆ బిడ్డ ప్రపంచంలో అతి పిన్న పరిణామంలో జన్మించిన శిశువుగా రికార్డుకెక్కింది. 
 
వివరాల్లోకి వెళితే.. జపాన్ టోక్యోలోని ఓ మహిళ గర్భంలో శిశువు ఆరుమాసాలే పెరిగింది. మిగిలిన నాలుగు మాసాలు కడుపులో పెరగడం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు నెల సదరు మహిళకు మగ బిడ్డ జన్మించాడు. 
 
అయితే బిడ్డ బరువు 268 గ్రాములే వున్నా.. సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టడంతో వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో ఆ బిడ్డను ఆరు మాసాల వరకు అత్యున్నత వైద్య సేవలు అందించారు. ఐసీయూలో వుంచి చికిత్స చేయించారు. 
 
ప్రస్తుతం ఆ బిడ్డ బరువు మూడు కేజీల 238 గ్రాములు. ప్రస్తుతం ఆ బిడ్డ ఆరోగ్యంగా వున్నాడని వైద్యులు తెలిపారు. ఆపై ఆ బాబును తల్లి చెంతకు చేర్చామని.. ఆస్పత్రి నుంచి ఆరు నెలలకు తర్వాత ఆ బిడ్డను ఇంటికి తీసుకెళ్లినట్లు వైద్యులు చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments