ప్రపంచంలో అత్యంత మురికి వ్యక్తి మృతి... ఇపుడు ఆ రికార్డు భారత్ సొంతం...

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (09:12 IST)
ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా రికార్డు సాధించిన ఇరాన్ దేశస్థుడు అమౌ హాజీ ఇకలేరు. 94 యేళ్ళ వయస్సులో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుడా హాయిగా ప్రాణాలు విడిచాడు. దాదాపు 60 యేళ్లుగా స్నానానికి దూరంగా ఉన్నారు. అయితే, ఆయన నివసించే గ్రామ ప్రజలు బలవంతంగా ఇటీవల ఆయనకు స్నానం చేయించారు. ఈ స్నానం చేయించిన కొద్ది రోజులకే ఆయన చనిపోవడం గమనార్హం. 
 
అమౌ హాజీ మృతితో ఇపుడు ఈ రికార్డు భారత్ సొంతమైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కైలాశ్ కాలౌ సింగ్ (63) గత 44 యేళ్లుగా స్నానానికి దూరంగా ఉన్నారు. ఈ విషయాన్ని గత 2009లోనే హిందుస్థాన్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో తాను స్నానానికి దూరంగా ఉన్నట్టు అప్పట్లో ఆయన వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ ఇరాన్ దక్షిణ ప్రావిన్స్ అయిన ఫార్స్‌లోని డెగ్జా గ్రామంలో మృతి చెందారు. ఆయనకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్థులే దయతలచి తలదాచుకునేందుకు చిన్న ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. 
 
చనిపోయిన మూగ జీవాల మాంసాన్ని ఆరగిస్తూ జీవిస్తూ వచ్చాడు. ఒకేసారి నాలుగైదు సిగరెట్లు ఊదిపడేసేవాడు. పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం బారినపడుతామన్న భయంతో స్నానాన్ని మానేసిన ఆయన.. సబ్బుతో ముఖం, కాళ్లు చేతులూ ఎన్నడూ కడుక్కోకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

రాజ్‌తో కలిసి సమంత దీపావళి వేడుకలు.. ఇక పెళ్లే మిగిలివుందా?

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments