Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజిప్టు గిజా పిరమిడ్ల వద్ద ఆ ఇద్దరు.. ఫోటోగ్రాఫర్లు నానా తంటాలు పడ్డారు..

ఈజిప్టులోని ప్రపంచ ప్రఖ్యాత పిరమిడ్ల వద్ద ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యక్తి.. ప్రపంచంలో అత్యంత పొట్టి మహిళ కలిశారు. పర్యాటకాన్ని ప్రమోట్ చేసే దిశగా వీరిద్దరినీ ఈజిప్టు కలిపింది. గిజా పిరమిడ్ల వద్ద వీరిద

Webdunia
ఆదివారం, 28 జనవరి 2018 (17:41 IST)
ఈజిప్టులోని ప్రపంచ ప్రఖ్యాత పిరమిడ్ల వద్ద ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యక్తి.. ప్రపంచంలో అత్యంత పొట్టి మహిళ కలిశారు. పర్యాటకాన్ని ప్రమోట్ చేసే దిశగా వీరిద్దరినీ ఈజిప్టు కలిపింది. గిజా పిరమిడ్ల వద్ద వీరిద్దరూ సందడి చేశారు. వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు నానా తంటాలు పడాల్సి వచ్చింది. 
 
ఈజిప్టు పర్యాటకాన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా ఈజిప్టు సర్కారు ఈ ఇద్దరితో ప్రచారం నిర్వహించాలనుకుంది. ఇందులో భాగంగా వీరిద్దరూ కైరోలోని చారిత్రక గిజా పిరమిడ్ల వద్ద పర్యాటకులతో కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు. ఈజిప్టులోని మరిన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ సుల్తాన్ కోసెన్, జ్యోతి అమ్గేలు సందర్శించనున్నారు.
 
కాగా టర్కీకి చెందిన సుల్తాన్ కోసెన్ (8 అడుగుల 2.8 అంగుళాల పొడవు) ప్రపంచలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా గిన్సిస్ రికార్డులకెక్కాడు. భారత్‌కు చెందిన జ్యోతి అమ్గే 2 అడుగుల 6 అంగుళాల పొడవుతో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించింది. వీరిద్దరూ 2011లోనే ఈ రికార్డులను సాధించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments