Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంధుల టీ-20 ప్రపంచ కప్: పాక్‌ను మట్టికరిపించి విజేతగా నిలిచిన భారత్

అంధుల ట్వంటి-20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ దాయాది దేశమైన పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. ముంబై పేలుళ్ల అనంతరం పాకిస్థాన్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ కప్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన టీమిండియా తరపున బరిలోకి ద

Advertiesment
Blind Cricket World Cup
, సోమవారం, 22 జనవరి 2018 (18:18 IST)
అంధుల ట్వంటి-20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ దాయాది దేశమైన పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. ముంబై పేలుళ్ల అనంతరం పాకిస్థాన్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ కప్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన టీమిండియా తరపున బరిలోకి దిగిన టీమిండియా బ్లైండ్ క్రికెటర్స్ పాకిస్థాన్‌కు చుక్కలు చూపించారు.

శనివారం షార్జాలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్‌ 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. దాయాదుల మధ్య జరిగిన ఫైనల్ పోరులో భారత పురుషుల అంధుల జట్టు టీ-20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. 
 
తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 40 ఓవర్లలోనే 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన భారత్ ఇంకా పది బంతులు మిగిలివుండగానే 308 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. 
 
భారత బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్లు వెంకటేష్‌ (32 బంతుల్లో 35), ప్రకాష్‌ (42 బంతుల్లో 44) భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. ఆపై సునీల్‌ రమేష్‌ (62 బంతుల్లో 93), కెప్టెన్‌ అజయ్‌ కుమార్‌ రెడ్డి (60 బంతుల్లో 62) పుంజుకుని టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా భారత అంధుల జట్టు కొత్త సంవత్సరం ఆరంభంలోనే ప్రపంచ కప్‌ను తన ఖాతాలో వేసుకుంది.

ఇకపోతే.. ప్రపంచకప్‌ గెలిచిన భారత అంధుల జట్టుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జట్టును అభినందించారు. ఈ ఆటతో దేశం గర్వించేలా, ప్రతి భారతీయుడూ స్ఫూర్తి పొందేలా చేశారని కొనియాడారు. మీరు నిజమైన ఛాంపియన్లు అంటూ ప్రశంసించారు. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు గుప్పించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీ అంటే బీసీసీఐకి వెన్నులో వణుకు : కాలమిస్ట్ గువా