Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... ప్రియుడిని చంపేసి ముక్కలు చేసి ఉడికించేసింది...

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (21:20 IST)
ఒక మహిళ తన ప్రియుడిని చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఆ మాంసాన్ని కుక్కర్‌లో వేసి ఉడికించేసింది. అయితే ఈ సంఘటన మన దేశంలో కాదు దుబాయ్‌లో జరిగింది.
 
మొరాకోకు చెందిన 37 ఏళ్ల మహిళకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయితే వారితో విడిపోయిన మహిళ పదేళ్ల నుండి దుబాయ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలో మొరాకోకే చెందిన 29 ఏళ్ల వ్యక్తితో ఆమెకు పరిచయం అయింది. ఈ పరిచయం ప్రేమగా మారి వారు సహజీవనం చేసుకునే వరకు వెళ్లింది.
 
ఇటీవలే ఆ వ్యక్తికి ఆ మహిళకు వివాహమైందన్న విషయం తెలిసింది. అప్పటి నుండి తరచూ వీరిమధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. హఠాత్తుగా ఒక రోజు ఆ మహిళ అతనిని చంపేసి, శవాన్ని ఏమి చెయ్యాలో తెలీక ముక్కలు ముక్కలుగా కోసింది. అయితే అప్పటికే ఇరుగుపొరుగు వారికి దుర్వాసన వచ్చి అడుగగా ఎండుచేపలు కొన్నానని, అవి పాడైపోయాయని చెప్పింది. ఆ తర్వాత ఆ మాంసాన్ని కుక్కర్‌లో వేసి ఉడికించింది. రెండురోజులు దాటినా కూడా దుర్వాసన తగ్గకపోవడంతో పక్కింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ మహిళ ఇంటిని సోదా చేయగా ఉడకబెట్టిన మనిషి మాంసం కనిపించింది. ఆ ఇంటిలో వాసన భరించలేక పోలీసులు చాలా కష్టపడ్డారు. అయితే ఆ మహిళ మాత్రం అక్కడ ఏమీ దుర్వాసన లేనట్లు చాలా సాధారణంగా ఉండటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments