Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆమె కౌగిలికి అంత పవర్... గంటపాటు కౌగిలించుకుంటే రూ. 5,630...

Advertiesment
ఆమె కౌగిలికి అంత పవర్... గంటపాటు కౌగిలించుకుంటే రూ. 5,630...
, మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (15:20 IST)
శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చెప్పినట్లు ఎవరైనా ఏదైనా బాధలో ఉంటే వారిని దగ్గరికి తీసుకుని హత్తుకుంటే ఎంతో ఊరట లభిస్తుంది. మన కష్టాలను వారు తీర్చకపోయినా కాసేపు దాన్ని మర్చిపోయి రిలాక్స్‌గా ఉండే భావన వస్తుంది. దీనిని కూడా ఉద్యోగంగా మార్చుకుని ఏడాదికి 28 లక్షల కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తోంది ఒక విదేశీ మహిళ. 
 
ఆమె పేరు రాబిన్ స్టినెకి. అమెరికాలోని కన్సార్ ప్రాంతానికి చెందిన ఈమె మీరు బాధలో ఉన్నారా, అయితే మీరెక్కుడున్నారో చెప్పండి, నేనే మీ దగ్గరికి వచ్చి ఓదారుస్తాను. నా కౌగిలిలో ఒదిగిపోండి, అంతకుమించి ఏదైనా చేస్తే అయిపోతారంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చేసింది.
 
ఈ హగ్ థెరపీ కేవలం పురుషులకే కాదు, మహిళలకు కూడా ఈ సౌలభ్యం ఉందని చెప్పింది రాబిన్. ఒకప్పుడు నేను చాలా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాను. సహాయం చేసేవారి మాట అటుంచి కనీసం ఓదార్చే దిక్కు కూడా లేక ఎంతో కృంగిపోయాను. అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది. తనలాగే బాధల్లో ఉన్నవారికి తన వంతు ఓదార్పు అందించాలని నిర్ణయించుకున్నానని అంటారు రాబిన్. 
 
ఈ ఆలోచననే వ్యాపార సూత్రంగా మార్చుకుంది. బాధలో ఉన్నవారి చేతిలో చెయ్యి వేసి, శరీరాన్ని నిమురుతూ ఉంటే ఆక్సిటోసిన్ రిలీజై ఒత్తడి దూరమవుతుంది. ఇది కూడా థెరపీ లాంటిదే. ఇలా చేసినందుకు గానూ గంటకు రూ.5,630లు వసూలు చేస్తోంది. అంటే ఏడాదికి 20 లక్షల పైమాటే అన్నమాట ఈమె ఆదాయం. మరి ఇలాంటివాటికి భవిష్యత్తులో ఏమయినా కండిషన్స్ పెడుతారేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమ్ముడు కుమార్తెను నరికి చంపి రక్తం తాగిన మహిళ... ఎక్కడ?