Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన అమ్మాయి కోసం పాకిస్తాన్ వెళ్లాడు... సైన్యం చేతికి చిక్కి... ఇపుడలా...

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (13:41 IST)
ప్రేమ కోసం సరిహద్దులు దాటి పాకిస్థాన్‌కు వెళ్లిన టెక్కీకి ఆరు నెలల జైలు శిక్ష తప్పలేదు. అయితే ఇటీవలే విడుదలైన అతడు యువతకు సందేశం ఇచ్చాడు. ఫేస్‌బుక్‌ను నమ్మి ప్రేమలో పడొద్దని, రిస్క్ తీసుకోవద్దని హితవు పలికాడు. అక్రమంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళొద్దని.. తల్లిదండ్రుల వద్ద ఎలాంటి విషయాన్ని దాచకండంటూ కోరాడు.. పాకిస్థాన్‌కు వెళ్ళిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హమీద్ అన్సారీ. 
 
ముఖ్యంగా ఫేస్‌బుక్ ప్రేమలో పడే కథే వద్దన్నాడు. ప్రేమ కోసం వెళ్ళి అక్కడ పోలీసులకు చిక్కుకున్న తాను.. పాకిస్థాన్ జైలు నుంచి విడుదల కాబోతున్నాననే వార్త వినగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యానన్నాడు. సినీ ఫక్కీలో పాకిస్థాన్ అమ్మాయి కోసం ముంబైకి చెందిన అన్సారీ ఆప్ఘన్ ద్వారా పాకిస్థాన్‌లోకి అడుగుపెట్టానని.. ఆమెకు బలవంతంగా పెళ్లి చేయబోతున్నారని తెలిసి అక్కడికెళ్లానని చెప్పాడు. 
 
చివరికి పాక్ సైన్యం చేతిలో చిక్కుకుని.. గూఢచర్యం ఆరోపణలతో ఆరు నెలల పాటు జైలులో పెట్టారని అన్సారీ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా.. మంగళవారం నాడు వాఘా-అట్టారి సరిహద్దులో అతన్ని భారత అధికారులకు పాకిస్థాన్ అధికారులు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments