సోషల్ మీడియా పుణ్యంతో కొన్ని వ్యవహారాలు వైరల్ అవుతున్నాయి. ఇలా గాడిదలు పెరిగిపోయాయని.. ఓ పాకిస్థాన్ రిపోర్టర్ చేసిన రిపోర్టింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. రిపోర్టింగ్‌లో బోలెడు అభిమానులను సంపాదించుకున్న పాకిస్థాన్ జియో న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ అమీన్ హఫీజ్ (32) ఈసారి గాడిదపై సవారీ చేశారు.
పాకిస్థాన్‌లో గాడిదల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయనే అంశంపై అమీన్ హఫీజ్ రిపోర్టింగ్ చేశారు. లాహోర్‌లోని గాడిదల ఆసుపత్రికి చేరుకున్న ఆయన అక్కడున్న గాడిదల యజమానులను ఇంటర్వ్యూ చేశాడు. గాడిదపై కూర్చుని వారిని ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.
అయితే హఫీజ్ బరువును మోయలేక కదలడంతో.. ఆయన కిందపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో హఫీజ్ గేదెను, మేకను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. 2002లో ఎలక్ట్రానిక్ మీడియాలోకి ప్రవేశించిన అమీన్ తన రిపోర్టింగ్‌తో వైరల్ కావడమే కాకుండా విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు.