ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఇతని స్థానానికి ఎసరు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ గతంలో అగ్రస్థానంలో కొనసాగాడు. అయితే బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాది పాటు అతనిపై నిషేధం వుంది. ఫలితంగా అతడి స్థానానికి టీమిండియా సారథి కోహ్లీ ఎగబాకాడు.
తాజాగా భారత రన్ మిషీన్ విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానానికి ఎసరు పెట్టేందుకు కివీస్ కెప్టెన్ సన్నద్ధమవుతున్నాడు. 913 పాయింట్లతో విలియమ్స్ రెండో స్థానంలో వున్నాడు. కోహ్లీ 920 పాయింట్లతో అగ్రస్థానంలో వున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరిగే టెస్టు సిరీస్‌లో కోహ్లీ 31 పరుగులతో రాణించినా.. అత్యధిక పరుగులు సాధించడంతో కోహ్లీ వెనుకడుగు వేశాడు.
ఈ నేపథ్యంలో కోహ్లీ కంటే ఏడు పాయింట్లు వెనుకబడి వున్న విలియమ్‌స్మిత్.. శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్‌లో విలియమ్‌స్మిత్ రాణిస్తే.. కోహ్లీని వెనక్కి నెట్టే అవకాశాలు లేకపోలేదని క్రీడా పండితులు జోస్యం చెప్తున్నారు.