Webdunia - Bharat's app for daily news and videos

Install App

కండోమ్స్ వాడండి.. ధృవపు ఎలుగబంట్లను రక్షించండీ

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (07:53 IST)
మాంచి మూడ్ లో వున్నప్పుడు చెబితేనే బాగా బుర్రకెక్కుతుందని అనుకున్నదో ఏమో, కాలిఫోర్నియాలోని సెంటర్ ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ ఓ వినూత్న ప్రచారానికి తెరలేపింది. ఈ నెల 25న వరల్డ్ కాంట్రసెప్టివ్ డేను పురస్కరించుకుని కాలిఫోర్నియాలోని 12 విద్యాసంస్థల్లో స్టూడెంట్స్‌కు కండోమ్ ప్యాకెట్లను పంచిపెట్టారు.

అంతరించిపోతున్న జీవాల చిత్రాలను ఆ కండోమ్‌ ప్యాకెట్లపై ముద్రిస్తూ..ప్రకృతిని కాపాడాలనే సందేశాన్ని ఇచ్చారు. ‘‘కండోమ్స్ వాడండి.. ధృవపు ఎలుగబంట్లను రక్షించండీ’’ అంటూ ఆకర్షణీయమైన నినాదాలతో ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.  
 
‘‘గర్భనిరోధక సాధనాల విస్తృత వినియోగంతో జనాభా పెరుగుదలను నియంత్రించి ప్రకృతిని కాపాడుకోవచ్చనే అంశంపై ప్రజల్లో ఒకసారి చర్చ మొదలైతే.. అది ప్రకృతి పరిరక్షణవైపు తొలి అడుగుగా మారుతుంది’’ అని సెంటర్ ఫర్ బయోలాజికల్ డైవర్శిటీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

అదుపు తప్పిన జనాభా పెరుగుదుల, సహజవనరుల అపరిమిత వినియోగం కారణంగానే అనేక జీవజాతులు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయని పేర్కొంది. ఈ వినూత్న ప్రచారం ప్రస్తుతం అనేక మందిని ఆకట్టుకుంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం