Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వతంత్ర భారత చరిత్ర, ప్రణబ్ విడదీయలేనివి: యూఎస్ సెనేట్ ఘన నివాళులు

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (12:29 IST)
ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఏడు దశాబ్దాలలో ప్రణబ్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలు మరవలేనిదని యూఎస్ సెనేట్ కొనియాడింది. స్వతంత్ర భారత్ చరిత్రను, ప్రణబ్‌ను విడదీయలేమని, ఇండియాలో జరిగిన అభివృద్ధి వెనుక ఆయన చేసిన కృషి ఎంతో ఉందని పలువురు ప్రజా ప్రతినిధులు ప్రణబ్‌ను గుర్తు చేసుకున్నారు.
 
భారత ప్రజలు ఓ గొప్ప నేతను కోల్పోయారని, ప్రణబ్ ముఖర్జీ పేరు తరతరాలు వినిపిస్తుందని సెనేట్ పేర్కొంది. ప్రణబ్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ బ్యూరో దక్షిణాసియా విభాగం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. కాగా 84 ఏళ్ల వయసులో చికిత్స పొందుతూ ప్రణబ్ ముఖర్జీ నిన్న సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే.
 
ప్రణబ్ ముఖర్జీ మరణం తనకు బాధ కలిగించిందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడటంలో తన తండ్రి హయాంలో ప్రణబ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సంతాపాన్ని తెలుపుతూ ముఖర్జీ ఓ గొప్ప రాజకీయ యోధుడనీ అభివర్ణించారు. రష్యా ఇండియాల మధ్య స్నేహ బంధం గొప్పగా ఉందంటే అందుకు ప్రణబ్ కూడా కారణమేనని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments