మాజీ రాష్ట్రపతి రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీ (84) సోమవారం డిల్లీ లోని ఆర్మీ రీసెర్చీ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే మంగళవారం ఉదయం ఆర్మీ ఆస్పత్రి నుంచి పార్థీవ దేహాన్ని రాజాజీ మార్గ్ లోని ప్రణబ్ అధికారిక నివాసానికి తరలించారు. ఆయన పార్థీవ దేహానికి పలువురు ప్రముఖులు అంజలి ఘటించారు.
మద్యాహ్నం 12 గంటలకు సైనిక గౌరవ వందనం, అనంతరం అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. 2 గంటలకు లోథి గార్డెన్ లోని శ్మశాన వాటికలో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే కోవిడ్ నిబంధనలు మార్గదర్శకాలు అనుసరించి మాజీ రాష్ట్రపతి అంత్య క్రియలు నిర్వహించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివాళిగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 6 వరకు కేంద్ర ప్రభుత్వం 7 రోజులు సంతాప కాలాన్ని ప్రకటించింది.