విద్యార్థుల వీసాలను నిలిపివేసిన ట్రంప్ సర్కారు!!

ఠాగూర్
బుధవారం, 28 మే 2025 (08:55 IST)
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో విద్యార్థి వీసాలను అమెరికా నిలిపివేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను షెడ్యూలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు మంగళవారం యూఎస్ ఎంబసీలకు దౌత్య కేబులు ద్వారా ఉత్తర్వులు జారీచేశారు. 
 
నిబంధనలు మరింత కఠినతరం చేసే దిశగా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగా  సిద్ధమవుతోంది. విదేశీ విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీపై కూడా అమెరికా దృష్టిసారించింది. దీంతో వివిధ దేశాల నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు చాలా మంది యూఎస్‌లో తమ భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నారు. 
 
ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయి. అవసరమైన సామాజిక మాధ్య ఖాతాల పరిశీలనకు సన్నాహాలు జరుగుతున్నాయి. తదుపరి ఆదేశాలు జారీ చేసేదాకా దౌత్య విభాగాలు అదనంగా ఎలాంటి వీసా అపాయింట్మెంట్లు అనుమతించవు అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని కొత్త నిబంధనలతో జారీ చేసిన తర్వాత వీసాల కోసం ముందస్తుగా బుక్ చేసుకున్న ఇంటర్వ్యూలు ప్రణాళిక ప్రకారం జరుగుతాయని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments