Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ ప్రధానికి తగ్గని కరోనా లక్షణాలు.. ఆస్పత్రికి తరలింపు

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (10:03 IST)
గతనెలలో కరోనా వైరస్ లక్షణాలు సోకిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌లో ఆ వైరస్ వ్యాధి లక్షణాలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే, ఆయన పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. 
 
మార్చి 27వ తేదీన బోరిస్‌లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆయన గత పది రోజులుగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అయినప్పటికీ... ఆయనకు గత ఏడు రోజులుగా ఈ వైరస్ లక్షణాలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో తన వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకు ప్రధాని ఆసుపత్రిలో చేరారు.
 
తన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉందని ప్రధాని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏడు రోజులు పూర్తయినా తనలో ఇంకా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారని, శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారని బోరిస్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైరస్ లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంత వరకు సెల్ఫ్ క్వారంటైన్‌లోనే ఉంటానని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments