Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రాగన్ కంట్రీకి షాకిచ్చిన బ్రిటన్.. 5జీ పరికరాలను కొనుగోలు చేయొద్దు

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (20:49 IST)
Huawei
బ్రిటన్.. డ్రాగన్ కంట్రీకి షాకిచ్చింది. 5జీ నెట్‌వర్క్‌లో చైనా కంపెనీ హువాయికి పరిమిత పాత్ర ఇవ్వాలనే నిర్ణయంలో బ్రిటన్ వెనక్కి తీసుకుంది. చైనా కంపెనీ హువాయి నుంచి వచ్చే ఏడాది ఆరంభంలో 5జీ పరికరాలను కొనుగోలు చేయరాదని టెలికాం ప్రొవైడర్లను బ్రిటన్‌ ఆదేశించింది. ఇప్పటికే చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించిన తరుణంలో బ్రిటన్ కూడా చైనాకు షాకిచ్చింది. 
 
దేశ 5జీ నెట్‌వర్క్‌ ప్రక్రియ నుంచి హువాయిని తొలగించాలని కోరుతూ పదిమంది కన‍్జర్వేటివ్‌ ఎంపీలు బోరిస్‌ జాన్సన్‌కు లేఖ రాశారు. మరోవైపు 5జీ ప్రక్రియలో తమపై బ్రిటన్‌ నిషేధం విధించడం నిరాశపరిచిందని, ఇది రాజకీయ నిర్ణయమని హువాయి వ్యాఖ్యానించింది.
 
అయితే హువాయి పరికరాల ద్వారా చైనా ప్రభుత్వం బ్రిటన్‌ నెట్‌వర్క్‌ల్లోకి చొరబడుతుందనే ఆందోళనతో ఇంటెలిజెన్స్‌ షేరింగ్‌ ఒప్పందం నుంచి వైదొలుగుతామని అమెరికా హెచ్చరించిన క్రమంలో 5జీ నెట్‌వర్క్‌ నుంచి హువాయిని బ్రిటన్‌ నిషేధించింది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments