Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికిపోతున్న హాంగ్‌కాంగ్.. 450 విమానాలు రద్దు.. ఎందుకు? (Video)

ఆసియా ఆర్థిక కేంద్ర‌మైన హాంగ్‌కాంగ్ గ‌జ‌గ‌జ‌ వణికిపోతోంది. ప‌వ‌ర్‌ఫుల్ టైఫూన్ 'హ‌టో' తీవ్రతకు చివురుటాకులా వణికిపోతోంది. టైఫూన్ దాటికి ఆఫీసులు, స్కూళ్లు బంద్ చేశారు. అంతేనా.. ఏకంగా 450 స్వదేశీ, అంతర్జ

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (14:43 IST)
ఆసియా ఆర్థిక కేంద్ర‌మైన హాంగ్‌కాంగ్ గ‌జ‌గ‌జ‌ వణికిపోతోంది. ప‌వ‌ర్‌ఫుల్ టైఫూన్ 'హ‌టో' తీవ్రతకు చివురుటాకులా వణికిపోతోంది. టైఫూన్ దాటికి ఆఫీసులు, స్కూళ్లు బంద్ చేశారు. అంతేనా.. ఏకంగా 450 స్వదేశీ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. 
 
ప్ర‌స్తుతం హాంగ్‌కాంగ్‌కు 60 కిలోమీట‌ర్ల దూరంలో టైఫూన్ హ‌టో కేంద్రీకృత‌మై ఉంది. హ‌టో నేరుగా న‌గ‌రాన్ని తాకుతుంద‌ని స్ట్రామ్ వార్నింగ్ సిస్ట‌మ్ హెచ్చ‌రించింది. అధికారులు ప‌ద‌వ హ‌రికేన్ హెచ్చ‌రిక సిగ్న‌ల్‌ను జారీ చేశారు. గ‌త అయిదేళ్ల‌లో ఈ హెచ్చ‌రిక ఇవ్వ‌డం ఇదే మొద‌టిసారి. 
 
టైఫూన్ వ‌ల్ల 126 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఇది 207 కిలోమీట‌ర్లు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఫలితంగా ట్రేడింగ్ కూడా నిలిపివేశారు. హ‌టో వ‌ల్ల అనేక వృక్షాలు నేలకూలాయి. భ‌వ‌నాల‌కు ఉన్న అద్దాల కిటికీలు ప‌గిలిపోయాయి. టైఫూన్ విధ్వంసం భయానకంగా ఉన్నట్టు సమాచారం. అయితే, ఇప్పటివరకు పెద్దగా ప్రాణనష్టం సంభవించలేదు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments