సియెర్రాలో దారుణం.. 300 మంది సజీవ సమాధి.. 600 మంది గల్లంతు
భారీ వర్షాల కారణంగా వరదలు సియెర్రా లియోన్‌లో దారుణం జరిగింది. సియెర్రా రాజధాని ఫ్రీటౌన్‌లో కొండచరియలు విరిగి పడి 300 మంది సజీవ సమాధి అయ్యారు. మరో 600 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
భారీ వర్షాల కారణంగా వరదలు సియెర్రా లియోన్‌లో దారుణం జరిగింది. సియెర్రా రాజధాని ఫ్రీటౌన్‌లో కొండచరియలు విరిగి పడి 300 మంది సజీవ సమాధి అయ్యారు. మరో 600 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు ముంచెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
ఈ నేపథ్యంలో కొండచరియలు విరిగి పడటంతో బురదల్లో, మట్టి పెళ్లల కింద చిక్కుకపోయిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 297 మృతదేహాలను వెలికి తీశారు. లియెర్రా లియోన్ అధ్యక్షుడు ఎర్నెస్ట్ బై కొరోమా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బుధవారం నుంచి ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఈ దేశంలో ఐక్యరాజ్యసమితి కూడా సహాయక చర్యలు చేపట్టింది.
మృతి చెందిన వారిలో 105 మంది పురుషులు, 83 మంది మహిళలు, 109 చిన్నారులు వున్నారు. ఇంకా సహాయక చర్యలు జరుగుతుండటంతో మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు తెలిపారు.