Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కలకలం... పిల్లులకు కూడా కరోనా...

అమెరికాలో కలకలం... పిల్లులకు కూడా కరోనా...
Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (09:31 IST)
కంటికి కనిపించకుండా ప్రపంచాన్ని తన గుప్పెట్లో బంధిస్తున్న కరోనా వైరస్.. ఇప్పటివరకు కేవలం మనుషులకు మాత్రమే సోకుతుందని భావించారు. కానీ, అమెరికాలో జరిపిన తాజా పరిశోధనలలో పిల్లులకు కూడా ఈ వైరస్ సోకుతందని తేలింది. దీనికి నిదర్శనంగా అమెరికాలో తొలిసారి రెండు పిల్లులకు ఈ వైరస్ సోకింది.
 
అమెరికా దేశంలోని న్యూయార్క్ రాష్ట్రంలో రెండు పెంపుడు పిల్లులకూ కొవిడ్-19 వచ్చిందని అమెరికా వైద్యాధికారులు ప్రకటించారు. రెండు పెంపుడు పిల్లులకు కొవిడ్ -19 సోకిందని అమెరికా దేశానికి చెందిన డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ), యూఎస్ డీఏ నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ లాబోరేటరీస్ (ఎన్‌విఎస్ఎల్) ధ్రువీకరించాయి. 
 
కరోనా వైరస్ సోకిన రెండు పెంపుడు పిల్లులు న్యూయార్క్ రాష్ట్రంలో వేర్వేరు చోట్ల నివశిస్తున్నాయని, ఇవి శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నాయని డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ అధికారులు చెప్పారు. ఈ పెంపుడు పిల్లులున్న గృహాలలో ఎవరికీ కరోనా సోకలేదని యూఎస్ అధికారులు గుర్తుచేశారు.
 
కాగా, న్యూయార్క్ రాష్ట్రంలో 2,58, 589 మందికి కరోనా సోకగా, వారిలో 15,302 మంది మరణించారు. ఒక్క న్యూయార్క్ నగరంలోనే 1,41,235 మందికి ఈ వైరస్ సోకింది. మొత్తంమీద రెండు పెంపుడు పిల్లులకు కూడా కరోనా సోకడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments