Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ పేరుతో కొండ అంచుకు తీసుకెళ్లి భార్యను కిందకు తోసేసిన భర్త...

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (16:47 IST)
టర్కీలో ఓ దారుణం జరిగింది. ఓ భర్త కట్టుకున్న భార్యను హత్య చేసేందుకు ఓ ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్ ప్రకారం తన భార్యను సెల్ఫీ తీసుకుందాంమంటూ కొండ అంచుకు తీసుకెళ్లి, అక్కడ నుంచి కిందికి తోసేశాడు. కేవలం భార్యకు వచ్చే బీమా సొమ్ముకు ఆశపడి ఆ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, టక్కీకి చెందిన వ్యక్తికి భార్య ఉంది. ఈమె గర్భందాల్చివుంది. అయితే, ఆమె మరణించాక వచ్చే బీమా సొమ్ము కోసం ఆశపడ్డాడు. ఇందుకోసం ఆమెను హతమార్చాలని ప్లాన్ వేశాడు. 
 
ఇందులోభాగంగా, సెల్ఫీ తీసుకుందామని చెప్పిన ఆమెను కొండ అంచువరకూ తీసుకెళ్లాడు. దాదాపు మూడు గంటల పాటు అక్కడే ఎదురుచూసీ, చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక ఆమెను కిందకు తోసేశాడు. దీంతో ఆమె చనిపోయింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు పూర్తి సమాచారం సేకరించి కోర్టుకు అందించారు. భార్య తీసుకున్న బీమా పాలసీల్లో నామినీగా భర్త హక్కాన్ పేరు మాత్రమే ఉంది. దీంతో ఆమెను చంపేస్తే బీమా సొమ్ము మొత్తం తనకే వస్తుందన భావించి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. 
 
అయితే.. హక్కాన్ అయాసల్ మాత్రం తాను నిర్దిషి అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కేవలం సంతకాల కోసమే భార్యకు ఇన్సురెన్సు డాక్యుమెంట్లు ఇచ్చానని, తతిమా వ్యవహారమంతా ఇన్సూరెన్స్ సంస్థ ఏజెంటే చూసుకున్నాడని చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments