రైల్వే స్టేషన్‌లో ఆగివున్న రైలు ఇంజిన్ పైకెక్కి సెల్ఫీ దిగపోయిన ఓ బాలుడు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు పౌరసరఫరాల శాఖలో క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. గురువారం తన 14 ఏళ్ల కుమారుడు జ్ఞానేశ్వర్‌ను తనతోపాటు విధులకు తీసుకెళ్లాడు. అతను రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. అతని కుమారుడు జ్ఞానేశ్వర్ సెల్ఫీ తీసుకునేందుకు ఆగి ఉన్న రైల్ ఇంజన్ పైకి ఎక్కాడు.
అయితే, రైల్ ఇంజన్ పైననే ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్‌లను గమనించకుండా జ్ఞానేశ్వర్ సెల్ఫీ కోసం చేయి పైకి లేపడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరునల్వేలి మెడికల్ కాలేజీకి పంపించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.