Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు నెలల గర్భవతిని కొండపై నుంచి తోసేసిన భర్త.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (15:40 IST)
భార్యాభర్తల అనుబంధం, ఆప్యాయత మంటగలిసిపోతోంది. గర్భవతి అయిన భార్యతో సెల్ఫీ తీసుకున్న భర్త అనంతరం ఆమెను కొండపై నుంచి తోసేశాడు. దీంతో కడుపులోని శిశివుతోపాటు ఆమె కూడా మరణించింది. టర్కీలోని ముగ్లలో ఈ దారుణం జరిగింది. 
 
40 ఏళ్ల హకన్ ఐసల్ ఏడు నెలల గర్భవతి అయిన 32 ఏళ్ల భార్య సెమ్రా ఐసల్‌ను ఫెథియే జిల్లాలోని బటర్‌ఫ్లై వ్యాలీకి విహార యాత్రకు తీసుకెళ్లాడు. వెయ్యి అడుగుల ఎత్తైన కొండపై ఆమెతో రొమాంటిక్‌ ఫోజులతో ఫొటోలు దిగాడు. అనంతరం భార్యను ఆ కొండ అంచు నుంచి తోసేశాడు. దీంతో ఎత్తు నుంచి కింద పడిన ఆమె, కడుపులోని బిడ్డతో పాటు మరణించింది. 
 
2018 జూన్‌లో ఈ దారుణానికి పాల్పడిన భర్త హకన్‌ను గత ఏడాది నవంబర్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్సురెన్స్‌ డబ్బుల కోసమే గర్భవతి అయిన భార్యను అతడు హత్య చేసినట్లు ప్రాసిక్యూటర్‌ కోర్టులో ఆరోపించారు. ఇది కుట్రపూరితమైన హత్య అని పేర్కొన్నారు. 
 
భర్త హకన్‌ తన భార్య సెమ్రా పేరుతో 4 లక్షల టర్కీష్‌ లిరా (సుమారు రూ.41.66 లక్షలు)కు వ్యక్తిగత బీమా తీసుకున్నాడని, లబ్ధిదారుడిగా ఆయనే ఉన్నాడని తెలిపారు. భర్య మరణాంతరం బీమా డబ్బుల కోసం దరఖాస్తు చేయగా కేసు దర్యాప్తులో ఉన్నందున ఆ సంస్థ దానిని ఆమోదించలేదని చెప్పారు. 
 
మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను హకన్‌ ఖండించాడు. తాను ఆమెను తోయలేదని, ఇది ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటన అని పేర్కొన్నాడు. కాగా ఇరువైపు వాదనలు విన్న ఫెథియే హై క్రిమినల్ కోర్టు ఈ ఘటనను హత్యగానే పరిగణించింది. నిందితుడైన భర్త హకన్‌ను కస్టడీలో ఉంచాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం