Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూనీషియాలో 11 మంది చిన్నారుల మృతి... హెల్త్ మినిస్టర్ రిజైన్

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (13:55 IST)
ఇటీవల బీహార్ రాష్ట్రంలో మెదడువాపు వ్యాధి బారినపడి సుమారుగా వందమందికిపైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రిలో ఎలాంటి చలనం లేదు. పైగా, అర్థంపర్థంలేని కామెంట్స్. ఫలితంగా బీహార్‌లో ఇప్పటికీ మరణమృదంగం కొనసాగుతోంది. 
 
కానీ, ట్యూనీషియా దేశంలో పరిస్థితి ఇందుకు విరుద్ధం. కేవలం 11 మంది చిన్నారులు చనిపోయినందుకే ఆ దేశ ఆరోగ్య శాఖామంత్రి తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. అంతేనా, ఈ మరణాలపై విచారణకు సైతం ఆదేశించండం జరిగింది. 
 
ట్యూనీషియా దేశంలోని రబ్టా క్లినిక్‌లో బ్లడ్ ఇన్ఫెక్షన్ కారణంగా 24 గంటల వ్యవధిలో 11 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. ఫలితంగా ఆ దేశ హెల్త్ మినిస్టర్ అబ్దుల్ రవుఫ్ ఎల్ షరీఫ్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే, చిన్నారుల మృత్యువాతపై ఆరోగ్య శాఖ సమగ్ర న్యాయ విచారణకు ఆదేశించింది. ఇందులో వైద్య సిబ్బంది అలసత్వం కారణంగానే చిన్నారులు చనిపోయారని తేలినపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments